రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి వారు చేసిన సేవలను కొనియాడిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ యస్, మహేందర్ ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగమని అది రచించిన గొప్ప మహానుభావుడని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం అనునది శరీరమైతే, రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది, మరియు అమలు చేయడం జరుగుతుంది. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ మన్ననలు పొందింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. రాజ్యాంగం పీఠిక ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఆకాంక్షించారు.భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అంకిత భావంతో విధులు నిర్వహిస్తామని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యాదమ్మ, సూపరిండెంట్లు ఎస్.కె జమీల్ పాషా, ఫియాజుద్దీన్, అబ్దుల్ ఆజాద్, కమ్యూనికేషన్ సీఐ ప్రవీణ్, ఆర్ఎస్ఐ నిరంజన్, ఐటీ సెల్ ఎస్ఐ శ్రీకాంత్, కమ్యూనికేషన్ ఎస్సై అభిలాష్, ఎస్బి ఎఎస్ఐ పద్మారావు, మరియు పోలీస్ కమిషనర్ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
