*వేసవి సెలవులలో మీ పిల్లలు జాగ్రత్త, పిల్లల పై ఓ కన్నేసి ఉంచండి, పిల్లల బాద్యత తల్లిదండ్రులదే*
*ఈత సరదా విషాదంగా మారకుండా చూసుకోవాలి*
*మైనర్లకు వాహనాలు ఇవ్వకండి, ఇచ్చి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దు*
కమిషనర్ కార్యాలయం నుండి పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ గారు మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులలో నీరు ఉన్నందున మరియు చెరువులలో కూడా మీరు నిండుగా ఉంది సరదా కోసం చెరువులు.. బావులకు ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈత నేర్పించాలని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్లాలని సూచించారు. ఒంటరిగా మరియు ఫ్రెండ్స్ తో పిల్లలను ఈతకు పంపవద్దని తెలిపారు. పిల్లల గురించి తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు.కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను మైనర్ పిల్లలకు ఇవ్వక పోవడం మంచిదన్నారు, ఏదైనా ప్రమాదం జరగకముందుకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మైన డ్రైవింగ్ చాలా ప్రమాదకరమని తెలిపారు.స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి. ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి.వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని ఏమైనా కొత్త విషయాలు నేర్పించాలి వేసవి సెలవుల్లో తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు.





