ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 21, స్వరాష్ట్రంలో విద్యుత్ కోతలతో చీకట్లను దూరం చేసేందు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలో వెలుగులతో నింపామని మంత్రి మంత్రి కేటీఆర్ అభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు వెచ్చించి మధ్యాహ్నం రాత్రి తేడా లేకుండా మండలాలలో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయించారు. ఇక విద్యుత్ సమస్యలను పూర్తిగా తొలగించి తెలంగాణ సమాజం గర్వించేలా ఉండాలని తపించారు. కానీ ముస్తాబాద్ మండల కేంద్రంలో పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరించడం ఓవైపు బతుకమ్మ దసరా పండుగలు సమీపిస్తున్న అధికారులకు నాయకులకు నిమ్మకు నిరెత్తకుండా వ్యవహరిస్తున్నారని ముస్తాబాద్ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ డివైడర్ నందు ఏర్పాటుచేసిన నామాత్రంగాసంవత్సరాలు గడుస్తున్న కన్నెత్తి చూడకపోవడం అధికారులు నిర్లక్ష్యం నీడలో కళ్ళు మూసుకొని నిద్రిస్తూ కుర్చీలకే పరిమితమయ్యారని ప్రజలు అంటున్నారు. తొమ్మిది రోజులు పాటు సాగే బతుకమ్మ పండుగలో మహిళలు సంతోషంగా బతుకమ్మలను తీరొక్క పూలతో పేర్చి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రకృతిని పూజించి బతుకమ్మ పండుగ ప్రత్యేకంగా మహిళలు నిలబెట్టే పండుగనే బతుకమ్మ.. ముఖ్యంగా మహిళలకు సంవత్సరానికి ఒకసారి కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదిరి చూడంగా వచ్చే అతిపెద్ద పండుగ బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా కలిసి ఇల్లంత సందడిగా ఉండగా మహిళలకు బతుకమ్మ అంటేనే సంతోషం లేకుండా ముస్తాబాద్ లో అందుకు భిన్నంగా మారింది. సాయంత్రం అయితే కారు చీకట్లు కమ్ముకొస్తున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకున్న పాపానా పోలేదని గ్రామ ప్రజలంతా పలు విధాల విమర్శిస్తున్నారు.




