సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును బేషరతుగా గజ్వేల్ కె కేటాయించాలి: గజ్వేల్ బీఎస్పీ నాయకుల డిమాండ్
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు బీఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో గజ్వేల్ పట్టణానికి సివిల్ కోర్టు కావాలని న్యావాదులు ధీక్షలో చేస్తే కచ్చితంగా గజ్వేల్ కి ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ గజ్వేల్ కి కేటాయించిన సివిల్ జడ్జ్ కోర్టును సిద్ధిపేటకు తరలించడం సరైంది కాదని దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని,సిద్దిపేట లో సివిల్ కోర్టు ఒకటి ఉన్నపటికీ అదనంగా మరొకటి కేటాయించడం చూస్తే గజ్వేల్ మీద కావాలనే కక్ష పూరితవైఖరి చూపిస్తున్నారు. దీన్ని బీఎస్పీపూర్తిగా వ్యతిరేకిస్తూ గజ్వేల్ పట్టణానికి సివిల్ కోర్టు కేటాయించే వరకు బార్ అసోసియేషన్ గజ్వేల్ కి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఉంటుందని జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్,నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్, ప్రధాన కార్యదర్శి మొండి కర్ణాకర్ మరియు గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి రాజు,మాజీ అధ్యక్షుడు గోపాలరావు, వల్లం కొండ శ్రీనివాస్, వనం భాస్కర్, పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి, బాలయ్య వెన్నెల స్వామి నరేష్ చారి ,ప్రశాంత్ కుమార్, శివుని ఎల్లయ్య పోలోజు నరసింహ చారి అబ్దుల్ గఫార్ ఇర్ఫాన్ మహమ్మద్ సమీర్ పెండెం శ్రీనివాస్ బొగ్గుల సురేష్ పాండవుల కనకయ్య,హైకోర్టు న్యాయవాది నలగమ శ్రీనివాస్ ,యాదగిరి నక్క రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు





