సభ్యత సంస్కారం మరిచి బీసీ మంత్రి కొండ సురేఖ పై అసభ్యకర మైన పోస్ట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగ్యరాజ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మహిళా నాయకులే లక్ష్యంగా టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పనిచేస్తుందని దాన్ని తెర వెనుక నడిపిస్తున్నది కేటీఆర్, హరీష్ రావుని అన్నారు. ఆనాడు సీతక్క, జిహెచ్ఎంసి మేయర్ పై ట్రోల్ చేసిన టిఆర్ఎస్ నాయకులు ,నేడు కొండా సురేఖ పై అసభ్యకర పోస్టులు పెట్టడం దారుణం అన్నారు. కాంగ్రెస్ మహిళా నేతల్ని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్న టిఆర్ఎస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మహిళల గౌరవాన్ని కాపాడేలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరించాలని లేనియెడల రానున్న రోజుల్లో మహిళలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, ఘాటుగా హెచ్చరించారు.
