ప్రాంతీయం

దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.

40 Views

గురువన్న పేట లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆకుల శిరీష.

సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30

సిద్దిపేట జిల్లా చేర్యాల కొమురవెల్లి మండలం గురువన్న పేట గ్రామంలో అభం శుభం తెలియని ఏడవ తరగతి చదువుతున్న బాలికపై ఇటీవల ఒక దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని చాలాసార్లు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డా దుర్మార్గున్ని ప్రభుత్వం పోలీసు వారు కఠినంగా శిక్షించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆకుల శిరీష డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో ఒక డాక్టర్ పై అత్యంత పాషవికంగా అత్యాచారం ఘటనకు ఒడిగట్టిన సంఘటనను మరువకముందే తెలంగాణలో సిద్దిపేట జిల్లా లో గల కొమురవెల్లి మండలంలోని గురువన్న పేట గ్రామంలో అభం శుభం తెలియని పసిపాపపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగులోకి రావడం ప్రభుత్వము మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఇలాంటి ఘటనలు అనేకమార్లు అనేకచోట్ల జరుగుతున్న కఠినమైన చట్టాలు చేసిన దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు కళాశాలల వద్ద పాఠశాలల వద్ద ఆకతాయి మూకలు ఆడపిల్లలను వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఆడపిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయం లో మునిగిపోతున్నారని ఎక్కడ నుండి ఏ దుండగుడు వచ్చి తమ ఆడబిడ్డలను పాడు చేస్తారనే భయం తల్లిదండ్రులు ఉంటుందని అన్నారు వ్యసనాలకు బానిసలై మధ్యము డ్రగ్స్ సేవిస్తూ ప్రేమ పేరుతో ఏకమంది ఈ దేశంలో బలి అయిపోతున్నారని అన్నారు వరంగల్ శ్రీ లక్ష్మీ ఘటన నుండి నిర్భయ అభయ దిశ మొదలుకొని మారుమూల పల్లెల్లో అనేకమంది ఆడపిల్లలు అత్యాచారాలకు గురై తమ మానప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఇంట్లోని సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని పరిస్థితులకు వ్యవస్థ దాపరించిందని ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు అత్యాచార ఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబం మానసికంగా వేదనకు గురవుతుందని  మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు పోలీస్  తీసుకోవాలని సత్వర న్యాయం తగు న్యాయం జరుగుతుందని ఆ కుటుంబానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తెలియజేశారు ఆడపిల్లలను బ్రతికించాల్సిన బ్రతకనివ్వాల్సిన అవసరం సమాజంపై ప్రభుత్వాలపై ఉందని భేటీ పడావో బేటి బచావో అన్న నినాదం ప్రకటనలకే తప్ప ఆడపిల్లకు రక్షణ లేదని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామస్థాయి నుండి ఇలాంటి సంఘటనలు చేసిన  విధించే శిక్షల గురించి స్పష్టంగా ప్రచారాల ద్వారా తెలియజేస్తూ ఇలాంటి నేరాలను నివారించడంలో ప్రజల సాయంతో ముందుకు వెళ్లాలని కోరారు ఈ ఘటనకు కారణమైన వ్యక్తులు ఎంతటి వారైనా రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా  కఠిన శిక్ష పడేలా పోలీస్  ప్రభుత్వము చొరవ చూపాలని డిమాండ్ చేశారు ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు విద్యార్థి సంఘాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు ఈ సమావేశంలో స్పందన శృతి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్