ముస్తాబాద్, సెప్టెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులు వడ్లను రోడ్లపైన ఆరబెట్టడం వలన వచ్యేపోయే వాహనదారులు ఆటంకమే జరుగుతుందని అంతే కాకుండా కొందరు ధాన్యం కుప్పల గమనించకుండా ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాల పెద్ద
దిక్కు కోల్పోయి చిన్నాభిన్నం అవుతారని ఎస్ఐ గణేష్ పేర్కొన్నారు. మరి ఆలాంటి ప్రమాదం జరిగినా అట్టిరైతులపై కేసులు నమో చేస్తామని అన్నారు. రైతులందరూ పోలీసులకు సహకరించి రోడ్లపైన వరి ధాన్యాన్ని ఆరబెట్టదని రైతులకు తెలిపారు. ఇదే క్రమంలో ఆవునూరు గ్రామానికిచెందిన వెంకట్ రెడ్డి వడ్లను రోడ్డుపైన ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డంగా ధాన్యాన్ని కుప్పలుగా పోసినదుకు ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ కేసు నమోదు చేశారు.




