ముస్తాబాద్/నవంబర్/02; ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో స్వచ్ఛత విషయంలో మెరుగుపడకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందిఅని కుర్చీలో కూర్చుంటూ అభివృద్ధి విషయాల్లో తీరా నిర్లక్ష్యం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అధికారుల పనితీరు చూస్తుంటే నిమ్మకు నీరు ఎత్తేట్టుగా ఉంది.
జనాభా, విస్తీర్ణంలో మనకంటే పెద్దనగరాలు స్వచ్ఛత విషయంలో పకడ్బదీగా చర్యలు చేపడుతుంటే మండలంలో తోపాటు గ్రామాలలో అభివృద్ధి విషయంలో వెనుకబడిపోవడం బాధాకరంఅని స్థానికులు అంటున్నారు.
తడి, పొడి చెత్తల సేకరణ, ప్లాస్టిక్ నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేయడంలో విఫలమయ్యారని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటివాటిని సంరక్షించుకోవాల్సింది పోయినిర్లక్ష్యంగా వదిలిపెట్టి వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటివరకు నాటిన మొక్కలకు ట్రీ గార్డులను అమర్చక గాలికి వదిలేసారని, కొన్ని గ్రామాలలో డ్రైనేజీ కాలువల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మంచినీటి వాటర్ ట్యాంకులను శుద్ది చేయడంలో విఫలమయ్యారని అన్నారు.
ఇటీవల కురిసిన ఎడతెరపు లేని వర్షాలకు రోడ్లకు ఇరువైపులా కయ్యలు, గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాల గురవుతున్నామని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు బస్టాండ్ ఆవరణలో పాటు రోడ్లను శుభ్రపరచడంలో విఫలమయ్యారని, అధికారులు మాత్రం దుర్యోనియాగం చేస్తు చల్లటి సీలింగ్ ఫ్యాన్ కిందనున్న కుర్చీలకే పరిమితమయ్యారు.
ఈ ఒక్కరోజు చికెన్ సెంటర్ వద్ద వ్యర్థ పదార్థాలను సేకరించడంలో అధికారులు ఫోటోలకు పరిమితమయ్యారు. మండలంలోని ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ప్రతిరోజు గ్రామపంచాయతీ అధికారులపై చర్యలు తీసుకున్నట్లయితే ముస్తాబాద్ లోని పబ్లిక్ టాయిలెట్స్ రూమ్స్ కూడా ఇంత అధ్వాన్నస్థితికి చేరుకునేది కాదు ఇంటింటికీ చెత్త సేకరణ వంటి అంశంలో మినహా మండలంలోని ఇతర అంశాలో పరిశుభ్రత పాటించడంలేదని ముఖ్యంగా మార్కెట్ ఏరియాల చేపల మార్కెట్ అలంకారప్రాయంగా ఉండి పిచ్చి మొక్కలతోపాటు చుట్టుపక్కల గడ్డితో చెత్తాచెదారం మారిపోవడం దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. పరిశుభ్రత చేయుటలో పబ్లిక్ మరుగుదొడ్లు నిర్వహణ వంటి విషయాల్లో పరిస్థితి ఇలానే ఉంటే స్వచ్ఛత విషయంలో ముస్తాబాద్ వస్తుందని స్పష్టంగా గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కుర్చీలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధి బాటలో నడిపించి ప్రజలకు సేవలు అందించాలని స్థానిక మండల ప్రజలు కోరుతున్నారు.
