మంచిర్యాల జిల్లా
పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నికలు.
నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ లోని కార్మిక మేస్త్రి భవన్ లో మంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నికలు జరిగాయి.
మంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎండి జమీల్ , జనరల్ సెక్రెటరీగా తాళ్ల గని, కోశాధికారిగా ములుగురి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దాసరి రాజబాబు, ప్రచార కార్యదర్శిగా బుగ్గని తిరుపతి, ఎండి రఫీ, ఎండి మజీద్, సురేందర్ రెడ్డి మరియు షేక్ జమీర్ పాషా ఎన్నికయ్యారు.
ముఖ్య సలహాదారులుగా బి నారాయణ, అధ్యక్షునిగా మాచర్ల సదానందం వీరందరూ కార్మికుల సమక్షంలో ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పెయింటర్ అసోసియేషన్ మేస్త్రీలు , కార్మికులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
