ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

75 Views

*పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న మోదీ  ప్రభుత్వం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *

జరిగిందఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి దండేపల్లి మండలం రెబ్బనపల్లి, వెంకటపూర్ మరియు దండేపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని మరొకసారి ప్రధాన మంత్రిని చేయాలని అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా బీజేపీ అభ్యర్ధి గోమాసే శ్రీనివాస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమ కోసం గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలిచారు అని అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీల రోజువారీ వేతనం రెట్టింపు చేసిన ఘనత నరేంద్ర మోదీ దే అని అన్నారు.

ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే మోదీ  ప్రభుత్వంలో ఉంటాడని మోదీ  దగ్గరికి మన ప్రాంత సమస్యలు తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కారించే బాధ్యత తమదని తెలిపారు. కావున బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, బత్తుల శేఖర్, మోటపలుకుల గురువయ్య, గాదె శ్రీనివాస్, గుండా ప్రభాకర్, బందేల రవి గౌడ్, ఎంబడి సురేందర్, గడికొప్పుల సురేందర్, బోడకుంటి వెంకటేష్, ముత్తే వెంకటేష్, పిట్టల అశోక్, పత్తిపాక సంతోష్, నెలిమెల మహేష్, చీర్ల వెంకటేశ్వర్లు, గుండా రవీందర్, వనపర్తి రాకేష్, ముతే అనిల్, యుగేందర్, గాలిపల్లి సత్యం, బెడద సురేష్, కొండు రాకేష్, బుచ్చన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్