ముస్తాబాద్, సెప్టెంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి): అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న నామాపూర్ కు చెందిన గట్టయ్యను రిమాండ్‌కు తరలింపు. ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నామాపూర్ కు చెందిన గట్టయ్య ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ ఎంతో కాలంగా సొమ్ము చేసుకుంటున్న నేరస్థుడు ఈ క్రమంలో అతను ఎనిమిది సార్లు పట్టుపడగా తీరు మార్చుకోని పరిస్థితి అతనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సిహెచ్, గణేష్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని పేర్కొన్నారు.

