ప్రాంతీయం

చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ కు ఘన సన్మానం

44 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టీపేట్ చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ , పదవికాలం అయిపోతున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ  వారందరినీ శాలువాలతో సన్మానించి, చిరు కానుక ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ పదవికాలం అయిపోయిందని ప్రజలకు దూరంగా ఉండకుండా, రానున్న రోజుల్లో కూడా నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ , కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్లు గా ఎదగాలని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు .

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్