ముస్తాబాద్, సెప్టెంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి): అవినీతీ బ్రాండ్ అంబాసిడర్లు అవినీతి జరిగిందని మాట్లాడటం సిగ్గుచేటని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు పేర్కొన్నారు. పది సంత్సరాల్లో ప్రజలకు ఏం చేయని బిఆర్ఎస్, ప్రజా పాలనలో ప్రజలకు మంచి జరుగుతుంటే అసూయ పడుతున్నారని, రేషన్ డీలర్ల పలితాలు వెలువడక ముందే ఆరోపణలు చేస్తున్నారని, ఉద్యమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని, కేకే మహేందర్ రెడ్డి రాజకియ భవిష్యత్ పై బురదజల్లే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని, పద్మశాలిలపై పక్షపాతం చూపిస్తున్నారంటూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని బతుకమ్మ చీరలపై భారీగా దోచుకున్నది మీరు…మీరు చేసిన బకాయిలను ఇచ్చింది మేమూ అని అన్నారు. స్వంత పార్టీ కార్యకర్తల దగ్గర పైసలు తీసుకొని సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చిన విషయం మరిచారా.? డబుల్ బెడ్, రైతు బంధు, సిఎంఆర్ఎఫ్ ఇప్పించడంలో మీ చేతివాటం చూపినా విషయం మరిచారా. మీ ప్రభుత్వంలో మీకు అనుకూలమైన అధికారులతో దొంగ పట్టాలు చేసుకొని వందల ఎకరాలను అప్పనంగా మింగిన ముచ్చట మరిచారా అంటూ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎన్నారై జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, నాయకులు ఆరుట్ల మహేష్ కుమార్ రెడ్డి, వుచ్చిడి బాల్రెడ్డి, యువత అధ్యక్షులు రంజాన్ నరేష్, మిడిదొడ్డి దేవేందర్, కేసు గాని చంద్రమౌళి, హరిబాబు, బాబు పాల్గొన్నారు.
