ప్రాంతీయం

విద్యుత్ వినియోగదారుల చెరువులో సెస్ డైరెక్టర్, అధికారులు…

298 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూన్16, వ్యవసాయ రంగంలొ విద్యుత్ వినియోగం పెరుగుట బీడు భూములను రైతులు పంట పొలాలుగా మార్చడంవల్ల ఎప్పటికప్పుడు బోరుబావులు వేయించి విద్యుత్ సాంక్షన్ పొందక ముందే మోటార్లు బిగించి తాత్కాలిక కనెక్షన్లు వేసుకొని మరికొందరు రైతులు సాంక్షన్ లేనివారు కూడా వాగులకు మోటర్లు బిగించుకొని రైతుల ఆర్థిక పరిస్థితి కారణంగా వారి సమయానుకూలంగా సాంక్షన్లు తీసుకుంటున్నారని తద్వారా ఎక్కువలోడు ట్రాన్స్ఫార్మర్ల పై పడి మరమతులకు గురవుతుంటాయి. మొత్తం మండలంలో 1000,కి పైచిలుకు ట్రాన్స్ఫార్మర్ ఉండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. దీంతోఎలాంటి సాంకేతిక సమస్య అయినా అధిగమించేలా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఇప్పటికే14. పైచిలుకు నూతన అధిక సామర్థ్యంగల ట్రాన్స్ఫార్మర్ లను అమర్చడం జరిగిందని సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మధ్యాస్తంగా ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లను గమనించి నూతన స్తంభాలను సుమారు 30.కి పైచిలుకు అమర్చడం పాడైపోయిన కండక్టర్లను తొలగించి కొత్తవి బిగించి విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా దెబ్బతిన్న స్తంభాలను ఇళ్లకు దగ్గరున్న విద్యుత్ వైర్లను మార్చే ప్రక్రియ దిశగా ఇప్పటివరకు గతేడాడితో పోలిస్తే ఈఏడాది విద్యుత్ వినియోగం అధికంగా పెరిగినప్పటికీ ముందుచూపుతో వ్యవహరిస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత వరకు వేసవిలో అధికలోడు వినియోగం కారణంగా వచ్చే అంతరాయాలను అధిగమించేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని సెస్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిననుండి త్వరితగతిన పూర్తి చేస్తున్నామని సందుపట్ల అంజిరెడ్డి తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *