
హరిదాస్ నగర్ లో మున్నూరు కాపు పటేల్ సంఘ భవనం ప్రారంభోత్సవం చేసిన మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య.
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో మున్నూరు కాపు పటేల్ సంఘం నూతన భవనాన్ని ఆదివారం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు,
సంఘం భవనానికి గ్రామ సంఘం స్వంతంగా 9 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ 5 లక్షల రూపాయలు మంజూరు చేశారని మొత్తం 14 లక్షలతో సంఘ భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందని సంఘం అధ్యక్షులు ఉప్పుల చిన రాజం తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు,స్థానిక సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్,మండల మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రచార కార్యదర్శి బండారి బాల్ రెడ్డి, సంఘం ప్రతినిధులు నంది కిషన్,మీసం రాజం, బోనాల సాయి లను సంఘం ప్రతినిధులు శాలువాలతో సన్మానించారు,ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఉప్పుల రవి,మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉప్పుల మల్లేశం,నాగరాజు,మాజీ సింగల్ విండో డైరెక్టర్ జంగిడి సత్తయ్య,శీలం అనిల్ కుమార్,శేఖర్, నారాయణ,రాములు,సత్తయ్య,రవి,శ్రీనివాస్,రమేష్, పర్షరాములు,తదితరులు పాల్గొన్నారు.





