ప్రాంతీయం

మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కు ఘన సన్మానం

60 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పద్మశాలి సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో గాడిపల్లి భాస్కర్ కు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారామ్, పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కు గజమాల, శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని ప్రజా నాయకుడు, రాజకీయంలో రాణించి ప్రజాసేవలో తన వంతు పాత్ర పోషిస్తూ అందరి మన్నన పొందుతూ ముందుకు సాగుతున్న గాడిపల్లి భాస్కర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం యువజన విభాగం కోశాధికారి గుండు మల్లేశం, ఉపాధ్యక్షులు సబ్బని చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, నాగరాజు, శ్రీనివాస్, హనుమాన్ దాస్, విష్ణువర్ధన్, కృష్ణ, ప్రసాద్, లక్ష్మణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7