ప్రాంతీయం

మద్యం సేవించి వాహనం నడిపిన 26 మందికి రూ.2,65,000- జరిమానా..

88 Views

మద్యం సేవించి వాహనం నడిపిన 26 మందికి రూ.2,65,000- జరిమానా..

-డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన నలుగురికి రూ.20,000/- జరిమానా..

సిద్దిపేట్, ఏప్రిల్ 24, తెలుగు న్యూస్ 24/7 

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 26 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా వాళ్ల ని ఈ వారం రోజులలో సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసి 26మంది వ్యక్తులకి రూ.2,65,000- జరిమాన విధించినారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని నలుగురికి రూ.20,000- జరిమాన విధించినారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల ని కట్టడి చేయడానికి, ప్రతిరోజుడ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకుకూడాప్రమాదమనిప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్టెస్టులునిర్వహించడంజరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ల ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పదివేల రూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహనరావడంజరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000- రూపాయల జరిమానా విధించడంజరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడంజరుగుతుందన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *