ఆసరా పించిని రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పించిని దారులు
తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్
అక్టోబర్ 25
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ కేంద్రంలో పత్రిక విలేకరులతో తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పించిని ప్రతి నెల చివరి తేదీన రాకపోవడంతో పించిని దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి అలాగే 4000 ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కలుపుకొని కొన్ని జిల్లాలలో కూడా ఇవ్వలేకపోయినారు అవి కూడా పించిని దారులకు అందించాలి కనీసము దసరా పండుగ కూడా నోచుకోని స్థితిలో వికలాంగులు ఉన్నారు ఈరోజు 25తేదీ వచ్చినా కూడా ఆసరా పించిని అందుకోలేకపోతున్నారు నిత్యవసరాలుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రతి నెల ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు ఏ అధికారికి చెప్పినా కూడా మా చేతుల్లో ఏమీ లేదు అంత ప్రభుత్వం చేతిలో ఉంది అని మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు కానీ మాకోసం పట్టించుకునే నాధుడు లేడు కాబట్టి తక్షణమే పించిని విడుదల చేయాలని కోరుతున్నాను





