ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కొటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి అన్నారు. బుదవారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో మహాలక్ష్మి పథకం మహిళా లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం. 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి వారికి విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్లకి గ్యాస్ సిలిండర్ రాయితీ పథకం వర్తిస్తుందని గడిచిన మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని సబ్సిడీని ప్రభుత్వం ప్రతినెలా ఆయా కంపెనీలకు చెల్లింపులు చేస్తుందన్నారు. ముందుగా మొత్తం నగదును లబ్దిదారులను చెల్లిస్తే రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాకు జమచేస్తారన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, రూ.500లకు గ్యాస్ సిలిండర్ అమలవుతున్నాయని త్వరలో నెలకు 2,500 నగదు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని పట్టాలెక్కిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్, డీలర్ అందె రాజి రెడ్డి, ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు పంచమి రామస్వామి, గ్రామ అధ్యక్షుడు పంచమి కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు సూరంపల్లి వినోద్, మిద్దె బాబు, ఎర్ర రాంబాబు ఉన్నారు.
