ప్రాంతీయం

గౌడసంఘంతో కలిసి ఈతమొక్కలను నాటిన ఎక్సైజ్ అధికారులు…

140 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో గీతా కార్మిక సంఘం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీతాకార్మిక సంఘం 2.ఎకరాల స్థలంలో ఈజీఎస్ నిధుల నుండి 2.వేల ఈత నర్సరీ మొక్కలు నాటిన కార్యక్రమానికి సూపరింటెండ్ పంచాక్షరి సిఐ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా ఎక్సైజ్ అధికారులు మండల ప్రజా ప్రతినిధులు అధికారులు గౌడ సంఘసభ్యులు మమేకమై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ ఈతమొక్కలను మనం కాపాడితే పెరిగి పెద్దయి మనని కాపాడుతాయి అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, సంఘ సభ్యులు కలిసి సాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, రాజారాం, యాదగిరి, బాలయ్య, ఎల్లయ్య, రంగయ్య, ఆంజనేయులు, దేవేందర్, బాలస్వామి, శ్రీనివాస్, పీజీఎస్ ఈ జీఎస్ అధికారులు పంచాయతీ కార్యదర్శి రమేష్, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7