తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పడిగెల మానస రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు, ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు, ఈ సందర్భంగా రాళ్లపేట సర్పంచ్ బాలసాని పరశురాములు తమ గ్రామ పాఠశాలకి ఉపాధ్యాయులు సరిపోవడం లేదని వెంటనే ఒక ఉపాధ్యాయుడిని పెట్టాలని డిమాండ్ చేశారు, అలాగే చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము, తమ గ్రామం నుండి పెన్షన్ పత్రాలు ఎలా మాయమయితాయని అధికారులను ప్రశ్నించారు, ఇలా ప్రతి సర్పంచ్ ,ఎంపిటిసి పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగెల మానస రాజు, ఎంపీడీవో లచ్చాలు, ఎమ్మార్వో సదానందం, ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




