– గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్
తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని తీగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్తా అన్నారు. వీర వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ,తిగుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల హక్కుల కోసం సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు తన వంతు పోరాటం చేసిన గొప్ప నాయకురాలు వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో
గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
