వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ప్రజ్ఞాపూర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు బద్రి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ సేవలను గుర్తు చేస్తూ,,,, వారి పోరాట స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో, మనమందరం అన్ని రంగాల్లో రాణించి ముందుకు సాగాలని అన్నారు.
