తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన రాయపోలు ఏపిఎం యాదగిరి, టిపిటిసి రాష్ట్ర జనరల్ మైనార్టీ సెక్రెటరీ ఇక్బాల్ తో కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంతో పాటు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చీరలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామి, గ్రామ అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ మాధవి, సిసి కుమార్, సీఏ కల్పన, వివో కవిత, పిడిచేడ్ నరసింహులు, శ్యామ్ రావు, నాగరాజు, రఫీ, భాస్కర్, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





