*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*కమీషనరేట్ లో 4656 గణేష్ విగ్రహాల ఏర్పాటు*
*గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్ ద్వారా భద్రత: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్*
రామగుండము పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిదిలో గణేశ్ ఉత్సవాలను, నిమజ్జన శోభ యాత్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తూ పటిష్ట చర్యలలో భాగంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని వినాయక మండపాల ప్రతిమలకు జియో ట్యాగింగ్ అనుసంధానం చేయడం జరుగుతుందని పోలీసు కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2405 మరియు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 2251 మొత్తం రామగుండం పోలీస్ కమిషనర్ వ్యాప్తంగా 4656 విగ్రహాలకు ఈ సంవత్సరం పోలీస్ వారి నిబందనల ప్రకారం ఆన్లైన్ లో అనుమతి తీసుకొన్నారని అని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఒక ప్రకటన లో తెలిపారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించే బ్లూకోర్ట్స్ సిబ్బంది గణేశ్ మండపాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయక మండపాల వివరాలను పోలీసులు ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లో తెలుసుకొని ట్యాబ్‌ల ద్వారా సంబంధిత గణేశ్ మండపాల ఫోటోలను తీసుకోవటంతో పాటు నిర్వాహకులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వెబ్ అప్లికేషన్ ద్వారా క్షేత్రస్థాయిలో జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇందులో నిర్వాహకులు పాటించాల్సిన నియమాలు, మండపం ఏర్పాటు, నిమజ్జనం ఏరోజు, ఎక్కడ చేస్తారనే వివరాలు, నిమజ్జన సమయం, రూట్ తో పాటు భద్రతా చర్యలపై పర్యవేక్షణ ఉంటుంది. మండపాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఉన్న బ్లూ కోల్ట్స్, ప్యాట్రో కార్ డేటాను పోలీస్ యాప్ తో కనెక్ట్ చేశారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మండపాల వద్ద ఎలాంటి సెక్యూరిటీ సమస్య తలెత్తినా సమాచారం అందిన వెంటనే అప్లికేషన్ లోని లోకేషన్ ఆప్షన్ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతం తెలుస్తుంది క్షణాల్లో చేరుకునేందుకు అవకాశం ఉంటుంది అని సిపి గారు తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, ప్యాట్రో కార్, బ్లూ క్లోట్స్ సిబ్బంది, అధికారులు, 24*7 పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. భక్తికి సంబంధించిన పాటలే ఉండాలి తప్ప ఇతర మతాల వారిని, ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, కించపరిచే విధంగా, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా ఎలాంటి గొడవలు జరిగిన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు, ఆంక్షలు పాటించాలని, ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.





