ప్రాంతీయం

సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి

70 Views

నూతనంగా ఎంపికైన గ్రామపంచాయతీ సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి.

సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ ఏ సీ – సెంటర్) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ అర్జిఎస్ఏ టిజిఐఆర్ డి ఆధ్వర్యం లో నూతనంగా ఎంపికైన గ్రామపంచాయతీ సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి.ముందుగా జ్యోతి ప్రచోదన చేసి జాతీయ గీతాలాపనతో కార్యక్రమంన్నీ ప్రారంభించారు.ఈ శిక్షణ లో 5 రోజుల పాటు ఆయా మండలాల గ్రామాలకు సెక్షన్ లగా అధికారులచే గ్రామపంచాయతీ పరిపాలన వ్యవస్థ గూర్చి శిక్షణ అందించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిపిఓ వినోద్ కుమార్, అధికారులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి సర్పంచులందరికి దేవుడు ఇచ్చిన ఒక సువర్ణఅవకాశం.ఈ అవకాశాన్ని అతి పవిత్రంగా భావించాలని గ్రామపంచాయతిలో ఏ పని చేసిన నిబద్ధతో చెయ్యాలని తెలిపారు. మీరందరూ రకరకాల కష్టాలు పడి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.మీ గ్రామంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక ను రూపొందించుకోవడానికి శిక్షణ తోడ్పడుతుంది. గ్రామపంచాయితీలో డ్రింకింగ్ వాటర్, పారిశుద్యం, సీసీ రోడ్లు ఒక మొదటి ప్రాధాన్యత గా భావించాలని గ్రామాల్లో ప్రజలను డ్రై డే జరుగుతుందా అని పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు.వచ్చే ఆదాయం గ్రామాల్లో పలు పన్నులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల గ్రాంట్ లు అన్ని చూసుకుని ఖర్చు చేసే బాధ్యత మీది.గ్రామాల్లో ఏ పని చేసిన వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంచాయతీ తీర్మానాల ఆధారంగానే పారదర్శకంగా పనిచేయాలని గ్రామ అభివృద్ధికి ఎల్లపుడు కృషి చెయ్యాలని ఈ అవకాశాన్నై సక్రమంగా,నిర్వహించుకోవాలని తెలిపారు.గ్రామాల్లో ఏదైనా తప్పులు చేస్తే ప్రజలు ఎల్లపుడు గమనిస్తూ ఉంటారు. మనకు మనమే న్యాయ నిర్ణేతగా అనుకొని మీరు చేసే కార్యక్రమాలు పది మందికి ఉపయోగపడేలా పది కాలాల పాటు మీరు చేసిన పనులకు గుర్తింపు లభించేలా పని చెయ్యాలని తెలిపారు.మహిళ సర్పంచులకు సూచన పెత్తనం అనేది మీ భర్తల చేతికి అందించకుండా మీరు కూడా ప్రతి చాలాశ్రద్ధగా,నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.జిల్లాలోనే ఉత్తమమైన గ్రామాలుగా ఎంపిక కావడానికి, ప్రభుత్వం అందించే పలు పథకాలను ప్రజలకు అందించడానికి నిరంతరం కృషి చెయ్యాలని గ్రామ అభివృద్ధి తోడ్పడాలని తెలిపారు.అనంతరం గ్రామంలో నిర్వహించే పలు కార్యక్రమాల తెలియజేసే పలు స్టాల్ లను ప్రారంభించి ప్రతిదీ సర్పంచులకు క్లుప్తంగా అర్థం అయ్యేలా వివరించాలని అధికారులను ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *