….బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గలో ని జగదేవుపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితి పారిశుధ్య మహిళ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఇందులో నాయకులు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకు రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత చూపాలని కోరారు.బెహేన్జీ కుమారి మాయావతి నాయకత్వం లో బహుజన్ సమాజ్ పార్టీ మహిళ సాధికారత కోసం పనిచేస్తుంది. అలాగే చదువుల తల్లీ సావిత్రి బాయి ఫూలే, మాత రమాబాయి ల త్యాగాల స్పూర్తితో బహుజన రాజ్యంలో మహిళలకు సమ న్యాయం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కటికెలా ఓo ప్రకాష్ , నియోజకవర్గ ఇంచార్జి కొండనొల్ల నరేష్ , నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మొండి కరుణాకర్ , జగదేవపూర్ సెక్టర్ అధ్యక్షులు కోరమైన గిరి , మచ్చ ప్రణీత్ ఇతరులు పాలుగొనడం జరిగింది.
