(కరీంనగర్ డిసెంబర్ 02)
అసెంబ్లీ ఎన్నికల విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గుంటి రాజలింగం కు ఉత్తమ పురస్కారం లభించింది..
కరీంనగర్ కమిషనరేట్ లో సిపి అభిషేక్ మహంతి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రాజలింగంకు ఉత్తమ ప్రశంసా పురస్కార అవార్డు అందజేశారు.. ప్రశంసా పత్రం అందుకున్న రాజలింగం ను సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది అభినందించారు…




