రాజకీయం

దండోరా చేసిన ఉద్యమం గుర్తుకు రాదా లేదా ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్ మాదిగ

133 Views

*SC, ST ఉద్యోగస్తులారా మీకోసం దండోరా నాడు చేసిన పోరాటం గుర్తులేదా..? గుర్తురాదా..??

(ప్రమోషన్లలో రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్ నడిపిన పోరాటం గురించి ఈవ్యాసం పూర్తిగా చదువగలరు.. ఇది కొంత భాగమే)

’19 -11-2002 హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో
రిజర్వేషన్ల సాధన పోరాటం.’

*”చరిత్ర విస్మరించలేని చారిత్రాత్మక ఉద్యమ ఘట్టం ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల సాధన పోరాటం.”*

దండోరా స్వతంత్ర భారతదేశంలో హక్కుల చైతన్యాన్ని మరిచిన దళిత, గిరిజన ఉద్యోగస్తులను ఐక్యం చేసింది. వారికి జరుగుతున్నా అన్యాయాన్ని గ్రహించి ఉద్యోగుల ఉన్నతి కోసం కొట్లాడింది, వృత్తిపరమైన ఇబ్బందులను, వివక్షతను రూపుమాపి మేమున్నామనే ఆత్మస్థైర్యాన్ని, దైర్యన్ని ఇచ్చి ముందుకు నడిపింది, తోటి ఉద్యోగులే, ఉద్యోగులుగా గుర్తించకుండా చిన్నచూపు చూస్తుంటే, అవమానాలకు గురిచేస్తుంటే, ఆచిన్నచూపుతో అవమానించే వాళ్లకు భయాన్ని, బాధ్యతను గుర్తుచేసింది, సంఘాల్లో, సమాజంలో నిలబడేటట్టు చేసింది, ఉద్యోగ సంఘాల తీరును గమనించి, జనరల్ ఉద్యోగ సంఘాల్లో మన ఉద్యోగస్తులు సభ్యులుగా ఉన్నాకూడా, ఏనాడూ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగస్తుల సమస్యలు ప్రస్తావనకు రాకుండా, అవి డిమాండ్ గా లేకుండా చేస్తుంటే, వాటి ధోరణిని ఎండగట్టింది, మన సమస్యల పట్ల నిలబడి పోరాడింది,1961 సం,,లో దామోదరం సంజీవయ్య గారు మనకంటూ ఒక జీఓ తెస్తే, ఆజీఓనే అమలు చేయించుకోలేని దుస్థితిలో, చదువుకొని ఉద్యోగాలు పొందిన మన మేధావి వర్గం ఉంటే, ఆ జీఓ 559 అమలు కోసం ఉద్యమించింది, మొట్టమొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల పేరుతో ‘ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్ల’ సాధన కోసం నినదించి, వేలాది మంది ఉద్యోగస్తులను సమాయత్తం చేసి పట్నం బాట పట్టించింది, 48 గంటల పాటు హైదరాబాద్ కేంద్రంగా అలుపెరుగని ఆందోళనను కొనసాగించి, చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచి, ప్రమోషన్లలో రిజర్వేషన్లను సాధించింది.. వాటి హక్కుల ఫలాలు మన ఉద్యోగస్తులకు పంచిపెట్టి ఉద్యోగుల గొంతుకై గర్జించింది దండోరనే ఎమ్మార్పీఎస్ అనేది ఓ నాషెడ్యూల్ కులాల, తెగల ఉద్యోగస్తులారా మర్చిపోకండి.. చరిత్ర దేనిని మరువదు.. నాడు మీకోసం దండోరా నడిపిన పోరాటాన్ని గుర్తుతెచ్చుకొండి.

2002లో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో దళిత, గిరిజన ఉద్యోగస్తుల కోసం ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరబాద్ కేంద్రంగా నడిపిన పోరాటమే అందుకు సాక్ష్యం. పోరాటం అంటే అలా ఇలా నడపడం కాదు, శ్రీలంకలో సాయుధ పోరాటాన్ని నడుపుతున్న ప్రభాకరన్ ఎల్టిటి ‘జాతు’ ఎట్లనో, మాఈ శాంతియుత పోరాటానికి ‘బాబు జగ్జీవన్ రాం కేంద్రం’ కూడా అట్లనే అని చాటిచెప్పి ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కు కోసం ఎంతవరకైనా తెగిస్తమని ప్రభుత్వానికే సవాల్ విసిరి సమరం సాగించడమంటే మామూలు విషయం కాదు.

అది ఏముకలు కొరికే చలిలో, చలి మంటలేసుకొని రొడ్డునే బిస్తరిగా చేసుకొని, పేపర్లు ఏసుకొని, వాటిపైనే పడుకొని, అనేక ఇబ్బందుల మధ్య అధినాయకుడితో సహా వేలాది మంది ఉద్యోగస్తులు పెద్దయెత్తున ఆందోళన చేపట్టింది, ప్రభుత్వం నిర్భందం పెట్టిన, ప్రజల దృష్టిని మరల్చే కుట్రలు, కుయుక్తులకు పాల్పడినా, అదిరించిన, బెదిరించినా అదరక, బెదరక 48గంటల పాటు అలుపెరుగకుండ, పట్టువిడువకుండ ఉద్యోగుల కోసం పోరాడింది ఎలా మరిచిపోగలం..?

ఆరు నెలల పాటు ఉద్యోగస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాంతం పర్యటించి, అనేక సభలు, సమావేశాలు నిర్వహించి, ఉద్యోగ వర్గాన్ని సంఘటిత పరచి అసెంబ్లీ సమావేశాల వేళా, 559 హక్కు కోసం ఓప్రవాహంలా SC,ST ఉద్యోగస్తులను హైదరాబాద్ కు రప్పించడం, ఆప్రవాహాన్ని ప్రజలకు కనపడనివ్వకుండా నాటి ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడడం, ఆకుట్రలను చిత్తు చేసేలా తన వ్యూహాత్మకమైన ఉద్యమ ఎత్తుగడలతో దాన్ని రెండు రోజులపాటు కొనసాగించి, సభా ప్రాంగణం వద్దనే నిలబడి మన ఉద్యోగుల పక్షాన ఉద్యమాన్ని ఉదృతం చేయడం చరిత్ర విస్మరించలేని చారిత్రాత్మక ఘట్టం.

మన ఉద్యోగుల సభ పెట్టిన రోజు రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ‘పీపుల్స్ వార్ బ్లాస్టింగ్’ జరిగితే, ఎన్నడూ లేని విధంగా, బ్లాస్టింగ్ పేరుతో నడుస్తున్న శాసనసభను అర్ధాంతరంగా ముగించి, చనిపోయిన వారి మీద కపట ప్రేమను వల్లిస్తూ పరామర్శకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయలుదేరితే, హైద్రాబాద్లో మందకృష్ణన్న పెట్టిన సభలో ఇగ ఉద్యోగస్తులు ఒక గంటో, రెండు గంటలో నిరసన చేసి ఇంటికి వెళ్తారని ప్రభుత్వం భావించింది.. అయితే ఆకపట ప్రేమను, కుట్రలను ముందే పసిగట్టిన కృష్ణమాదిగ గారు, ఇది ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్ల పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు వేసిన ఎత్తుగడేనని గ్రహించి, సౌకర్యాలు ఏమీ లేకున్నా, ముఖ్యమంత్రి వచ్చేదాక, మన సమస్యను పరిష్కరించేదాకా ‘సభా ప్రాంగణం’ వదిలి వెళ్ళబోమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి కృష్ణన్నతో సహా వేలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిద్రాహారాలు మాని, విపరీతమైన చలిలో, దోమలు కుడుతుంటే, మరొకవైపు వందల సంఖ్యలో పోలీసులు లాఠీలు పట్టుకొని చెదరగొట్టేందుకు పన్నాగాలు పన్నుతుంటే, రక్షణ వలయంలా మారి, రోడ్డు మీదనే జాగారం చేస్తూ ‘మా పోరాటం శాంతియుతంగానే నిర్వహిస్తాం కానీ మాసహనాన్ని పరీక్షించాలని చూస్తే, పోలీసు బలగాలతో అణచాలని చూస్తే, తిరుగుబాటుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే దమ్ము కూడా మాకు ఉన్నదనేది’ మర్చిపోవోద్దని ఒక బలమైన హెచ్చరిక చేసి ప్రభుత్వం దిగొచ్చేలా కొట్లాడడం అషామాషి విషయమా..??

రిజర్వేషన్ల ద్వారా 50 మంది ఎమ్మెల్యేలు,6 మంత్రులు SC,ST లు గెలిచి చట్టసభల్లో ఉన్నా, ఉద్యోగుల కోసం కొట్లాడే నాయకులం మెమే అనే వారున్నా, వచ్చిన జీవోనే తిరిగి సాధించే దమ్ములేకుంటే మన కోసం కొట్లడింది ఎవరు..? మన సమస్యను ఒక ఉద్యమ రూపంగా మలిచి పోరాటం కొనసాగించింది ఎవరు..? మంద కృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్ కాదా..?!

మన సామాజిక వర్గాల నుండే వచ్చినమనే కనీస స్పృహను మరచి, అన్యాయం జరుగుతున్న నోరు మెదపకుండా అగ్రకుల రాజకీయ నాయకులకు ఎస్సీ ఎస్టీ మంత్రులే చెంచాగిరి చేస్తుంటే, మీబాధ్యతను మీరు నిర్వర్తించాల్సిందే..ఇకనైనా మీరు మాట్లాడకపోతే, ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే, మీఇండ్ల ముందు దండోరేయాల్సిస్తోందని హెచ్చరించి, మేము పెట్టిన ఈసభకు, మీరున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కు ‘రెండు కిలోమీటర్ల’ దూరమే ఉన్నది మర్చిపోయి, మౌనం పాటిస్తే వదిలిపెట్టమని ఆగ్రహిస్తేనే, ప్రభుత్వంపై వారు ఒత్తిడి పెంచింది, ఆతర్వాతనే ప్రభుత్వ ప్రతినిధుల బృందం చర్చలకోచ్చింది, తక్షణమే ప్రభుత్వం జీఓ 559 అమలు చేసింది, అలా అమలు చేయడం ద్వారానే ఫలితం వచ్చింది అనేది మరిచిపోవద్దు. నేడు మీరు ప్రమోషన్లు పొంది ఉన్నతమైన స్థానంలో జీవిస్తున్నా, మీరు అనుభవిస్తున్నా ఈఉద్యోగ జీవితం, ఎమ్మార్పీఎస్ నడిపిన పోరాటం ద్వారానే వచ్చిందనేది ఉద్యోగస్తులారా గుర్తుపెట్టుకోండి.!

నాడు నడిపిన పోరాటం, వేలాది మంది దండోరా కార్యకర్తల కష్టం, దాని ద్వారా ఉద్యోగులు పొందిన మేలు సాక్షిగా గర్వంగా చెప్పుత్తున్నా, రిజర్వేషన్లలో ప్రమోషన్లు పొందిన ఉద్యోగస్తులు తింటున్న ప్రతి మెతుకు మీద *”మందకృష్ణన్న”* పేరు ఉందని, వారు ఉన్నత స్థానాల్లోకి ఎదిగిర్రు అంటే దానివెనుక వేలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల శ్రమ దాగిఉన్నదని. ఉద్యోగులారా ఇకనైనా గ్రహించండి.!

అయితే ఉద్యోగస్తుల ఉన్నతికి ఇంత చేసినా ఇప్పుడు మన ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది..?? మన ఉద్యమ సంఘం, నాయకత్వంపై చూపే విశ్వాసమెంది? విధేయత ఏంది..?? సంఘ కార్యక్రమాల్లో వారి ప్రాతినిధ్యం ఏందీ..?? నాటి పరిస్థితిని మినహాయిస్తే, నేడు జాతి ప్రజలకు న్యాయం చేకూర్చే పోరాటాల్లో వారి పాత్ర ఎంత అనేదే ప్రశ్న.??

చిన్న చిన్న అంశాలు, కారణాలు కాదు.. విశాల దృక్పథంతో ఆలోచించండి.

ప్రమోషన్ లో రిజర్వేషన్ల జీవో తిరిగి సాధించకుంటే ఎక్కడుండేటోళ్లు..?? మీరు అనుభవించే స్థానం, హోదా ఇతరత్రా అవకాశాలు మీకు నేడు వచ్చేవా..? ఒకసారి ఆత్మసాక్షిగా ఆలోచించండి.?? దండోరా తెచ్చిన 559 జీవో సామాన్య ప్రజల కోసమో, పేదల కోసమో, నిరక్ష్యరాసుల కోసమో, నిరుద్యోగుల కోసమో ఉపయోగపడేది కాదు కదా.! అక్షరాల ఉద్యోగస్తుల కొసం దళిత, గిరిజన ఉద్యోగస్తులు ఉన్నత స్థానాల్లోకి ఎదగాలని, వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వచ్చిందే కదా, మరి అది దండోరా పోరాటం చేయకపోతే వచ్చేదా..? దాన్ని నేడు మరువడం, విశ్వాసాన్ని, విధేయతను విడువడం తమకు భావ్యమా..? ఇకనైనా మారండి జాతి ఉద్యోగులుగా బాధ్యతను గుర్తెరిగి జాతి లక్ష్యసాధన పోరాటంలో మీపాత్రను మీరు సమర్థవంతంగా నిర్వర్తించండి.!

అందర్నీ కాదు.. కొందరినే అంటున్నా..!

నేడు మన ఉద్యోగస్తులు..
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల చైతన్యాన్ని మరిచారు..
ఎస్సీ, ఎస్టీ ప్రజల నుండి వచ్చిన మనేది మరిచారు..
చదువుకునే రోజుల్లో ఎస్సీ కులం సర్టిఫికెట్ల కోసం తాపత్రయపడ్డారు..
ఉద్యోగాల్లో చేరేటప్పుడు కులం పత్రంపైనే ఆధారపడ్డారు.
కానీ ఉద్యోగాల్లో చేరిన తర్వాత మాత్రం కులాన్ని దూరం పెట్టారు..ఆకులాల అభ్యున్నతి కోసం తాము నిర్వర్తించే ధర్మాన్ని మరిచారు.! జాతికి దూరంగా నిలుస్తున్నారు.!

కాబట్టే ఉద్యోగస్తులు తమ ఉనికిని కోల్పోయారు..!

ఇంకా నిజం చెప్పాలంటే కృతజ్ఞత చాటాల్సింది పోయి కొద్దిమంది ఉద్యోగస్తులు వాస్తవాలను మరిచి, ఇంత చేసిన ఎమ్మార్పీఎస్ నే లేకుండా చేయాలని కుట్ర చేశారు, చేస్తున్నారు.! వింత వాదనలతో విషం చిమ్ముతున్నారు.!

చరిత్ర దేనిని మర్చిపోదు.!!

నినాద ఫలాన్ని విస్మరించి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మన్యవర్ కాన్షిరాం గారిని నమ్మించినట్టే, మోసగించినట్టే, కృష్ణమాదిగ గారిని కూడా మోసగిస్తే జాతి వెనక్కి పోతది తప్ప ముందుకు పోదని, త్వరగా జాతికి ప్రయోజనం చేకూరదని గుర్తుచేస్తున్నాం..! తమరు ఎదిగారని, జాతి ఉద్యమ సంఘాన్ని పక్కకుపెట్టి రకరకాల సిద్ధాంతాలతో ఆకాశంలో విహరిస్తే ఒరిగేదేమీ ఉండదు, కాలం గడుస్తది అంతే కానీ మరొకటి కాదు.

అదే మన జాతిలో ఎదిగిన, చదువుకున్న ఉద్యోగ, మేధావి వర్గంగా తమరి బాధ్యతను తాము నిర్వర్తిస్తే పుట్టిన జాతికి ఫలాల్ని అందించి, మేలు చేశామనే సంతృప్తినైనా పొందుతారు. అప్పుడు అఫలితాన్ని పొందే జాతి తమరికి రెట్టింపు స్థాయి గౌరవాన్ని, జాతి గుండెల్లో చెరగని స్థానాన్ని ఇస్తుందనేది మర్చిపోకూడదు. ఇక మేధావి మౌనం జాతికి, సమాజానికి ప్రమాదకరమే కాబట్టి, ఉద్యోగ వర్గపు మేధస్సు జాతికి దిశా నిర్దేశం చేసే స్థానంలో ఉండాలని విన్నావిస్తూ.. ఆ దిశగా ఉద్యోగ వర్గపు ప్రయాణం ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.!!

“రాజకీయ స్పృహ లేని సామాజిక ఉద్యమాలు మనగడ సాగించవు యెట్లనో సామాజిక న్యాయ స్పృహ లేని రాజకీయ పోరాటాలు కూడా ఫలితాన్ని సాధించవు.”

కానీ దండోరకు రాజకీయ, సామాజిక న్యాయ స్పృహ ఉన్నది.

దండోరా చేపట్టిన పలు సామాజిక ఉద్యమాలు రాజకీయ స్పృహలోంచి పుట్టుకొచ్చినవే. దాని ప్రధాన లక్ష్యమైన SC వర్గీకరణ సామాజిక న్యాయ సూత్రమే. కాబట్టి దాని ప్రయాణం స్వతంత్రంగా లక్ష్యసాధన దిశగానే నడుస్తుంటది.. సామాజిక న్యాయంతో కూడిన నూతన సమాజ నిర్మాణానికి తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటది.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనే, సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు కేంద్రం.. సామాజిక, ఆర్థిక ఎదుగుదలే శాశ్వత రాజ్యాధికార సాధనకు మార్గం.

అందుకే మాదిగల ప్రథమ లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ.. అంతిమ లక్ష్యం రాజ్యాధికార సాధనే.

దండోరా స్పష్టమైన ప్రయాణ సిద్దాంతాన్ని గ్రహించి నేటి అంతిమ పోరాటంలో ఉద్యోగులు భాగం కావాలని, తమ మేధస్సునే పెట్టుబడిగా పెట్టి రేపటి ఆశయ సాధనకు బలంగా బాటలు వేయాలని కోరుకుంటున్నాం.!

గమనిక: ఇది కొద్ది మంది ఉద్యోగస్తులకు మాత్రమే వర్తిస్తుంది. జాతి ఉద్యమ పోరాటంలో మొదటి నుండి నేటి వరకు అదే నిబద్ధతతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా శ్రమిస్తున్న వారికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.! మెజార్టీగా ఉండి దండోరా మేలును పొంది, మౌనంగా ఉంటూ జాతికి మేలు చేకూర్చే పోరాటంలో భాగంకానీ ఉద్యోగవర్గం తమ విధానాలు ఇకనైనా మార్చుకొవాలని, తమరి బాధ్యతను విస్మరించొద్దని గుర్తుచేసే ప్రయత్నమే “నాటి పోరాటం గుర్తులేదా…? గుర్తు రాదా..?”.

(సరిగ్గా ఈరోజే అనగా రెండు దశాబ్దాల క్రితం 19, 20 – నవంబర్-2002 రోజున పోరాటం, ఫలితం సాధించిన సందర్భంగా..)

కానాపురం లక్ష్మణ్మాదిగ*
( ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ రాజన్న సిరిసిల్ల
..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7