నేరాలు రాజకీయం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.

94 Views

—–రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరం
—–మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
—–క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి కొండా సురేఖ
—–ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన నీలం మధు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని చందాపూర్
గ్రామ శివారులో
ఎస్ బీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చందపూర్ ఎస్బి కెమికల్స్ లో ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే మంత్రి కొండా సురేఖ, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తో కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 50 మందికి పైగా కార్మికులు డ్యూటీలో ఉండగా రియాక్టర్ పేలుడుకు కంపెనీ డైరెక్టర్ రవివర్మతో సహా ఆరుగురు మృత్యువాత పడ్డట్లు వివరించారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలు ఇవ్వగా అందులో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం చందా పూర్ లో ఎస్బి కెమికల్స్ ను జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకుని ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రమాదం పై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి వెంట (టి ఎస్ ఐ ఐ సి) చైర్మన్ , సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి ,నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , జిల్లా అధ్యక్షులు నరసింహ రెడ్డి, హత్నూర మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ తో పాటు పలువురు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్