సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఏస్సీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున కొమ్ము రమేష్ కుటుంబానికి ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి సౌజన్యంతో నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు నాయకులు నర్సింలు నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది. కొమ్ము రమేష్ కుటుంబ సభ్యులు మామిడి మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ శ్రీనివాస్, లింగోళ్ళ కిష్టయ్య, మద్దూరి బిక్షపతి, కొమ్ము నరసింహులు తదితరులు ఉన్నారు.
