దౌల్తాబాద్: దుబ్బాక బిజెపి అభ్యర్థిగా తనకు బి ఫామ్ ఇస్తే గెలుపు ఖాయమని బిజెపి సీనియర్ నాయకులు, పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ నాయిని రాజగోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఓ ఫంక్షన్ హాల్ లో తన మిత్ర బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం తాను కృషి చేశానని, మీ అందరి సహాయ సహకారాలతో దుబ్బాకలో బిజెపి జెండా ఎగిరిందని అన్నారు. దుబ్బాక బిజెపి అభ్యర్థిగా బీఫామ్ అడిగానని అధిష్టానం తనకు ఇస్తే కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. తన అభిమానులు పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని తెలుపగా పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలని అభిమానులకు సూచించానని తెలిపారు. అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు బీఫామ్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు సత్తురాజి రెడ్డి, పిఎసీఎస్ డైరెక్టర్ సంజీవరెడ్డి, రెడ్డిపల్లి చేగుంట మాజీ ఉపసర్పంచ్ నర్సింలు, ఫులి మామిడి మాజీ సర్పంచ్ రత్నయ్య, నాయకులు గల్వ ఉపేందర్ రెడ్డి, గడ్డం వెంకట్, మధు, బిక్షపతి, ముత్యాలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు…..
