ప్రాంతీయం

డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ నియామకం

276 Views

డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ నియామకం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ & రాష్ట్ర సంఘ నాయకుల సమక్షంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి విచ్చేసిన ప్రింట్ మీడియా& ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టుల సమక్షంలో ఎంతో హట్టహాసంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మోకనపల్లి బద్రి ఎన్నికయ్యారు. అదేవిధంగా జిల్లా కార్యవర్గంలోని వివిధ స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. ఇందులో జిల్లా జనరల్ సెక్రెటరీగా బర్ల తిరుపతి , ట్రెజరీగా చొప్పదండి జనార్ధన్, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా కుషనపల్లి సతీష్, కార్యదర్శిగా వేల్పుల నగేష్ ,జిల్లా కార్యదర్శిగా పసునూటి ఆంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శిగా జిల్లపెళ్లి రాజేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనపర్తి కుమార్, జిల్లా అధికార ప్రతినిధిగా కుర్రే శ్రీకర్, జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎండి .నౌషద్, జిల్లా ప్రచార కార్యదర్శి కొడప మంజుల, జిల్లా కార్యవర్గ సభ్యులు కుడుదుల కిరణ్ కుమార్, రాగి రాజేష్, పిట్టల ఈశ్వర్, చిలువేరి రాజశేఖర్ తదితరులు ఎన్నిక అయ్యారు.

ఈ కార్యక్రమాన్ని డి జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోటపలుకుల వెంకట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ ,రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లయ్య మహర్షి ,ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్చార్జి పార్వతి రాజిరెడ్డి ,రాష్ట్ర సహాయక కార్యదర్శి సతీష్ లు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్