(తిమ్మాపూర్ ఆగస్టు 23)
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఖండించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలోనే
ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ,గృహజ్యోతి, ఏక కాలంలోనే రెండో లక్షల రుణమాపీ అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ పైన, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పైన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు..
బీఆర్ఎస్ పార్టి గురువారం రైతు రుణమాపీ పై నిరసన వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కవ్వంపల్లి పై ఆరోపణలు చేయడన్ని కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ,ఆగ్రహం వ్యక్తం చేశారు..
కవ్వంపల్లికి తెల్ల రేషన్ కార్డు ఉండి లక్షా 50 వేల రుణమాఫీ తీసుకున్నాడని మాట్లాడిన నువ్వు తెల్ల రేషన్ కార్డు ఉందని నిరూపించకుంటే ముక్కు నెలాకు రాస్తావా అంటు హెచ్చరించారు..నోరు ఉంది కదా అనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పు దెబ్బలు, చీపిరి దెబ్బలు తప్పవంటూ ఘాటు వాక్యాలు చేశారు…
కాంగ్రెస్ కార్యకర్తలకు రుణమాపీ వచ్చిధనడం సిగ్గుచేటు అని, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతిఒక్కరికి 2 లక్షల రుణమాపీ చేసిన ఏకైక పార్టి కాంగ్రెస్ పార్టి అని కొనియాడారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులో తప్పిదల వల్ల కొంతమందికి 2 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే రుణమాపీ జరగలేదని వాటీని సరి చేసుకుంటే రుణమాఫీ జరుగుతుందని అన్నారు…
బీఆర్ఎస్ పార్టి హయాంలో గుట్టలకు కూడా రైతు బంద్ తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ సాగు చేసే భూములకే రైతుబంధు ఇచ్చిందని, మీలాగా గుట్టలు వున్నా భూములకు ఇవ్వలేదని అందులో భాగంగానే కవ్వంపల్లి కుటుంబ సభ్యులకు రైతుబంధు వచ్చిందని అని అన్నారు…
కవ్వంపల్లి కుటుంబానికే రైతుబంధు, రుణమాఫీ వచ్చిందంటూ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు..
రసమయి బాలకిషన్ వెంటనే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై చేసిన అనుచిత వాక్యాలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు….
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెల్లరేషన్ రేషన్ కార్డు ఉందని నిరూపించకుంటే, మానకొండూర్ నియోజకవర్గంలో రసమయి బాలకిషన్ ను తిరిగినివ్వమని, చెప్పు దెబ్బలు, చీపిరి దెబ్బలతో కొడుతామాని ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..