ప్రాంతీయం

అన్నదానం మహా దానం – నంగునూరి సత్యనారాయణ

126 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఆదివారం కీర్తిశేషులు దూబకుంట గోదావరి, నాగభూషణం దంపతుల జ్ఞాపకార్థం , వారి కుమారులు దూబకుంట రుక్మయ్య, దూబకుంట లచ్చలు సౌజన్యంతో దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో వివిధ సందర్భాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా దూబకుంట రుక్మయ్య, దూబకుంట లచ్చలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు సిద్ది బిక్షపతి, శ్రీహరి, తోట బిక్షపతి, కైలాస ప్రశాంత్,గందే సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found