ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే

36 Views

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం.

బాధిత కుటుంబాలకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శ.

చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం ధర్మారం మండలంలో మార్కెట్ చైర్మన్ లావుడ్య రూప్ల నాయక్, దేవి రాజమల్లయ్య కుటుంబాలను పరామర్షించారు. లావుడ్య రూప్ల నాయక్ తండ్రి రత్త నాయక్ ఈ నెల 13వ తేదిన చనిపోగా వివేక్ వెంకటస్వామి బంజేరుపల్లి లోని వారి ఇంటికి వెళ్లి రత్త నాయక్ చిత్ర పటం వద్ద నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ పత్రిక విలేఖరి దేవి రాజమల్లయ్య చిన్న కుమారుడు దేవి సిద్దార్థ్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందగా వారి ఇంటికి వెళ్లి సిద్దార్థ్ ను పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ధర్మారం బ్లాక్ 2 కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, దేవి జనార్ధన్, మార్కెట్ డైరెక్టర్లు కాంపెళ్లి రాజేశం, గంధం మహిపాల్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, ఒరెం చిరంజీవి, ఎండీ హఫీజ్,దేవి అకిల్, పొన్నం కృష్ణ, పొన్నవేని స్వామి,ఎండీ అష్షు, మాల సంఘం నాయకులు దేవి రాజలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్