ప్రాంతీయం

సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అరకు యువ క్రీడాకారిణికి ఖమ్మం స్వేరో అండ

35 Views

సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అరకు యువ క్రీడాకారిణికి ఖమ్మం స్వేరో అండ

ఖమ్మం, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7

ఖమ్మం  సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోల ద్వారా అరకు ప్రాంతానికి చెందిన యువ క్రీడాకారిణి కొర్ర జీవనతన్య స్వేరో టాలెంట్‌ను గుర్తించిన ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్.ఆమె క్రీడా ప్రగతికి ముందడుగు వేసింది.ఈ క్రమంలో ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్ అధ్యక్షులు శ్రీకాంత్ స్వేరో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 10 కిలోమీటర్ల రన్ ఈవెంట్‌లో జీవనతన్య పాల్గొనడానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించారు.ఈ సహకారం వల్ల జీవనతన్యకు తన ప్రతిభను మరింత విస్తృతంగా ప్రదర్శించే అవకాశం లభించిందని ఆమె తండ్రి బాబురావు తెలిపారు. తమ కుమార్తె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్ అధ్యక్షులు శ్రీకాంత్ స్వేరోకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రాంతీయ యువ క్రీడాకారులకు ఇలాంటి సహకారం భవిష్యత్‌లో మరిన్ని ప్రతిభలను వెలికి తీయడానికి దోహదపడుతుందని స్వేరో నాయకులు అభిప్రాయపడ్డారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *