మంగపేట,సెప్టెంబర్ 02
మంగపేట మండల కేంద్రంలోని వైస్సార్ విగ్రహం వద్ద మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి స్వర్గీయ డాక్టర్ రాజ శేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహనికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించిన మానవతామూర్తి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేది కపైనే వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన రైతు బాంధవుడు ఫీజు రీయింబ ర్స్‌మెంట్ పాటు నిరుపేదలకు సరస్వతీ కటాక్షంపా రదర్శక విధానాలతో పారిశ్రామికాభివృద్ధి పెట్టుబ డుల ఆకర్షణలో అగ్రగామిగా రాష్ట్రం అన్నదాతలకు అండ సంక్షేమానికి అభివృద్ధికి చిరునామా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి అని ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపే దలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన ఆశయాలను కొనసా గిస్తూ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్ర మంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య,జిల్లా సెక్రటరీ మసిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్య క్షులు మహబూబ్ ఖాన్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,నర్రా కిషోర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ,యూత్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న, సీనియర్ నాయకులు మైపా లాలయ్య,బోడ జయరాజ్,పోడెం నగేష్, తాలూకా సంపత్, పాల్గొన్నారు.