ప్రాంతీయం

రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

91 Views

*రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం*

రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పేరుతో కేవలం కొంత మందికి మాత్రమే రైతు రుణ మాఫీ అమలు చేయండాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణ మూర్తి గారు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రాగానే డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడానికి బిజెపి జిల్లా పార్టీ తప్పుపడుతుంది ఎన్నికల ముందు బేషరతుగా రుణమాఫీ అన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు అని కుటుంబానికి ఒక్కరికని నిబంధనలు పెడుతూ రైతులను మోసం చేయడంలో తన పాత్రను పోషిస్తుంది రాష్ట్రంలో 47 లక్షల రైతులు రుణమాఫీ చేయాల్సింది ఉండగా నేటి వరకు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీకి కావలసిన బడ్జెట్ 31 వేల కోట్లు అవసరం ఉండగా నేటి వరకు 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేశారు ఆగస్టు 15 తారీకు వరకు రుణమాఫీని పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు కూడా రైతులకు రుణమాఫీ అయినట్లు బ్యాంకుల్లో వారి ఎకౌంట్లో డబ్బులు పడక పోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతును రుణమాఫీ పేరుతో ప్రభుత్వం పాలాభిషేకలతో సంబరాలు చేసుకున్న శ్రద్ధలో రుణమాఫీకి చేసి రైతుల రుణం తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ శ్రద్ధ చూపడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది అన్నారు రుణమాఫీకి నిధుల కొరత చెప్తున్న ప్రభుత్వం రుణమాఫీ చేశామని ప్రకటన పేరుతో ప్రచారం పేరుతో ఇప్పటివరకు సుమారుగా 300 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని తెలుస్తున్నది ఇప్పటికైనా ప్రభుత్వం ఆంక్షలు లేని అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీని చేయాలని బిజెపి ప్రభుత్వాన్ని కోరుతున్నది.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చ్చా అధ్యక్షులు మాధవరపు వెంకట రమణారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మోటపలుకుల తిరుపతి, ముదాం మల్లేష్, కిసాన్ మోర్చా బిజెపి నాయకులు పచ్చ వెంకటేశ్వర్లు, గాజుల ప్రభాకర్, రవీందర్, బోయిని దేవేందర్, బల్ల రమేష్, హనుమండ్ల శ్రీనివాస్, రాజనర్సు, రాయెల్లి మల్లేష్, గాదర్ల సతీష్, అర్నకొండ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్