విద్య

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం..

56 Views

(మానకొండూర్ ఆగస్టు 15)

విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం మా సేవలను జిల్లా స్థాయిలో గుర్తించి ప్రశంసా పత్రాన్నిఅందుకున్న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ పిజిటి టీచర్ అనిల్ బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరెట్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రతిభ ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం నాకేంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ..

విద్యార్థులకు చెప్పిన విద్యాబ్యాసం లో నన్ను ప్రభుత్వం గుర్తించి నాకు ప్రతిభా ప్రశంసా పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాల అనందంగా ఉందన్నారు.ప్రిన్స్ పాల్ ప్రియదర్శిని, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, టీచర్లు లెక్షరర్ లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ అభిషేక్ మహంతి,జిల్లా కలెక్టర్ పమేల సత్పతి,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,కరీంనగర్ డీఈవో జనార్ధన్ రావు & జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్