విద్య

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

56 Views

(శంకరపట్నం జూన్ 19)

కరీంనగర్ జిల్లాలోని మొగ్దూంపూర్ గ్రామంలో 1989- 1990 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గొల్లె సాయిలు, కొమ్మిడి సుధాకర్ రెడ్డి నిర్వాహణలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరుపుకున్నారు.

ఇట్టి కార్యక్రమానికి తమ గురువులను ఆహ్వానించుకొని అప్పటి విద్యార్థినీ విద్యార్థులు అంతా కలిసి వారిని శాలువాలతో సన్మానించుకున్నారు. తదుపరి వారి వారి జీవితంలో గడిచిన మధుర స్మృతులను గుర్తుచేసుకొని ఒక్కొక్కరుగా ఉపన్యాసాలు ఇచ్చారు.

అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, కేరింతలు వేస్తూ, డాన్సులతో తమ,తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరినీ ఒకరు కలుసుకొని మాట్లాడుకోవడం, తమ బాల్యంలో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను సమ్మేళనానికి విచ్చేసిన గురువులు పూర్వ విద్యార్థిని విద్యార్థులు నిర్వాహకులైనటువంటి గొల్లే .సాయిలు , మరియు కొమ్మిడి.సుధాకర్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం స్వీట్ల పంపిణీ చేసుకొని విందు భోజనం చేసుకున్నారు. చివరగా ఆటపాటలతో ఈ ఆత్మీయ సమ్మేళనం అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపింది.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్