ప్రాంతీయం

సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం

12 Views

సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెన్నూర్ మరియు బెల్లంపల్లి నియోజకవర్గలలో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఈరోజు మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  సన్మానించి అభినందించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అదే గ్రామాల్లో బీజేపీ పార్టీ సర్పంచ్ లను మరియు వార్డు సభ్యులను గెలిపించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో దుర్గం అశోక్ ,గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు,ఎనగందుల కృష్ణ మూర్తి కోడి రమేష్ ,రాచర్ల సంతోష్ ,అక్కల రమేష్ ,జోగులా శ్రీదేవి ,వైద్య శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *