ప్రాంతీయం

పారిశుద్ధ్య కార్మికులసమ్మే అరకొర వేతనం.. రెగ్యులరైజ్ చేయడం.. ప్రభుత్వం విఫలమైందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు సమ్మేపోరులో…    

112 Views
      ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై6, ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ ప్రభుత్వాలు మారుతున్న పట్టించుకోని వైనం అన్నారు కార్మికులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కుర్రరాకేష్ మాట్లాడుతూ పనిబారెడు వేతనం బెత్తడు అన్నట్లుగా మారింది మాగ్రామపంచాయతీ కార్మికుల పరిస్థితి జనాభా అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకున్నా దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోందిని ప్రభుత్వం అరకొర వేతనాలు చెల్లించి వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఇప్పటికైనా 19.వేల వేతనం పెంచాలని 51.జీవోని రద్దు చేయాలని కార్మికులతో కలిసి ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికులు దశాబ్దాలుగా చాకిరి చేస్తున్న రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తే పెద్దఎత్తున తీవ్రస్థాయిలో దిగుతామని స్పష్టం చేశారు. మాకార్మికులు సమ్మెబాట పడితే గ్రామాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, తదితర సేవలపై తీవ్ర ప్రభావం పడనుందని పారిశుద్ధ్య కార్మికులు వెల్లడించారు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *