ముస్తాబాద్, ఆగస్టు11 ( 24/7న్యూస్ ప్రతినిధి): స్నేహమంటే సుఖ సంతోషాలతో పాటు కష్టాల్లో కూడా మేమున్నామని భరోసా కల్పించడమే స్నేహానికి నిర్వచనమని నిరూపించారు. మల్లారెడ్డిపేటకు చెందిన విజయ్ గౌడ్ చిన్నతనంలో ముస్తాబాద్ లో 5.వ తరగతి నుండి10.వతరగతి వరకు విద్యను అభ్యసించాడు నాడు స్నేహంచేసిన అందరూ బాగానే ఉండి పైచదువులతో విడిపోయారు. వారి వారి స్తోమతలను బట్టి చదువుకుంటారు. మరికొందరు వృత్తుల్లో స్థిరపడతారు. కానీ ఒకే తల్లి కడుపులో పుట్టిన బిడ్డలకే తలరాత ఒకేలా ఉండదు. స్నేహితులకు కూడాఅంతే కొన్ని స్థితిగతులు మార్పు అన్నది సహజం. కానీ ఆ రోజుల్లో చదువుకునే మిత్రుడు విజయ్ గౌడ్ ను నేడు విధి వక్రీకరించడంతో పక్షవాతానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొన్న ఒకే క్లాస్మేట్ మిత్రులు కలిసి ఆ కుటుంబాన్ని ఫర్మార్సించి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పాల్గొన్నవారిలొ ముత్యాల దేవేందర్, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, బండారి రమేష్, పార్వతి శ్రీధర్, దావీరెడ్డి దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
