ప్రాంతీయం

సూపర్ స్పెషాలిటీ మరియు మాత శిశు హాస్పిటల్ కు శంకుస్థాపన

74 Views

మంచిర్యాల నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ మరియు మాత శిశు ఆసుపత్రి శంకుస్థాపన.

మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 300 కోట్ల రూపాయలతో 650 పడకల నూతన సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు ఆసుపత్రి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ కమిటీ చైర్మన్ శ్రీ జనక ప్రసాద్ మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ , మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి,  బోర్కడే హేమంత్ సహదేవరావు ఐఏఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

650 పడకల హాస్పిటల్ లో 225 పడకలను మాతా శిశు హాస్పిటల్ కు మరియు 425 పడకలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేటాయించనున్నట్లుగా మంచిర్యాల శాసనసభ్యులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలియజేశారు. హైదరాబాదు లాంటి మహా నగరాల కు దీటుగా ఈ యొక్క హాస్పిటల్ నిర్మించి హైదరాబాదుకు వెళ్లకుండా ఇక్కడే రోగులందరికీ మెరుగైన చికిత్స, వైద్యం అందించేలా చేస్తామని, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చుట్టుపక్కల ఏరియాల నుండి మంచిర్యాలకు చికిత్స కోసం వస్తారని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కి, మరియు దామోదర రాజనరసింహ కి,  దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు .

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్