ప్రాంతీయం

గోవిందపూర్ గ్రామంలో వీధి కుక్కల దాడి

108 Views

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ గోవిందాపూర్ లో చిన్నారుల పై వీధి కుక్కలు దాడి. అభం శుభం పసిపిల్లల పైన కుక్కల దాడి జరిగిన సంఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని గోవిందాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రెండవ శనివారం కావడం చేత పాఠశాలకు సెలవు ఉండడంతో విద్యార్థులు ఆడుకుంటున్న క్రమంలో కుక్కలు గ్రామానికి చెందిన మేకల మనస్వి, ప్రావీణ్య, జయ ముగ్గురు పిల్లలు ఆడుకునే సమయంలో ఒకేసారి దాడి చేయడం జరిగింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామాలలో కుక్కల బీభత్సం రోజురోజుకు పెరిగిపోతుంది ఇకనైనా అధికార యంత్రం చర్యలు తీసుకొని కుక్కలను నుంచి పసిపిల్లలను కాపాడాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found