దౌల్తాబాద్ మండల పరిధిలోని
చెట్లనర్సంపల్లి గ్రామానికి చెందిన నందిని గౌడ్ కు 35,000 రూపాయల CMRF చెక్కును అందించిన దౌల్తాబాద్ తాజా మాజీ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలు ఎవరైనా కార్పోరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకున్న వారు హాస్పిటల్ బిల్లు, పేపర్స్ మాకు ఇచ్చినట్లయితే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు డాక్టర్ యాదవరెడ్డికి ఇచ్చి సీఎంఆర్ఎఫ్ కింద డబ్బులు వచ్చే విధంగా చూస్తామని అమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ వేమ జనార్ధన్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వేమ సత్యం, సీనియర్ నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు.




