మంచిర్యాల జిల్లా:
చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 64మంది లబ్ధి దారులకు, 20 మంది లబ్ధి దారులకు కళ్యాణ లక్ష్మి శాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
వివేక్ కామెంట్స్
చెన్నూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
పేదవారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాలను అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1.50 వేల వరకు రుణ మాఫీ చేయడం జరిగింది.
సుమారు 60 శాతం మంది కి రుణ మాఫీ జరిగింది.
ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ చేస్తాము.
కొందరు అంటున్నారు మాకు రుణమాఫీ రాలేదని అంటున్నారు వారికి నేను లిస్ట్ రాసి ఇవ్వమని అన్నాను.
లబ్ధి దారులకు తప్పకుండా రుణ మాఫీ చేపిస్తాము.
ఆరు గ్యారంటీ లలో 5 పూర్తి చేసాము.
రాష్ట్రంలో విద్య వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది.
నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
చెన్నూర్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా కు తావు లేదు.
ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను, పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్.
ఇసుక క్వారీలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తాను.
మొన్న అక్రమాలకు పాల్పడిన ఐదుగురు సిబ్బందిని తొలగించడం జరిగింది.
ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించిన వివేక్ వెంకటస్వామి.





