సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని పురాతన ఆలయం శ్రీ పార్థిశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని శివునికి పాలాభిషేకం నిర్వహించారు, ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నా యాదవ్ మాట్లాడుతూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపారు, హిందువులు ఆరాధించే దేవతామూర్తుల్లో నాగదేవత ఒకరని, ప్రతి సంవత్సరం నాగుల చవితి సందర్భంగా మహిళలు నాగదేవతను ప్రత్యేకంగా పూజించి, వారి భక్తిని చాటుకుంటారని అందులో భాగంగా పురాతన పార్థిశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.
