హిందువుల పవిత్రమైన నాగుల పంచమి పురస్కరించుకొని వినూతనంగా కర్బుజ కాయ మీద శివలింగం, త్రిశూలం, నాగ దేవత చిత్రాలను అత్య అద్భుతంగా చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిఆవిష్కరించి భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళలు ఉదయమే భక్తి శ్రద్దలతో గుడికి వెళ్లి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించు కుంటారు. శ్రావణమాసం అంతా కూడ భక్తులు భగవన్నామ స్మరణలో గడుపుతారన్నారు.
